14 March, 2026 | 11:56 PM

మండల స్థాయి శిక్షణా సమావేశం

14-03-2026 07:06 PM

మంగపేట,(విజయక్రాంతి): ప్రజా పాలన–ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం ములుగు జిల్లా మంగపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు గదిలో మంగపేట మండల ప్రత్యేక అధికారి, జిల్లా పంచాయతీ అధికారి (డిపిఒ) అధ్యక్షతన మండల స్థాయి శిక్షణా నిర్వహించారు. మండలంలోని ఆయా శాఖల వారీగా చేపట్టుతున్న సంక్షేమ పధకాలు ప్రజలలోకి ఎలా చేరాలి, ఎలా చేరుతాయని  విషయాలను ఆయా శాఖల అధికారులు వివరించారు.

ఈ సమావేశంలో మంగపేట ఎంపీడీఓ బి.బద్రు నాయక్, ఎంపీఓ గుగులోత్ మహేందర్, తహసీల్దార్ తోట రవీందర్, ఎస్సై టీవీ.ఆర్. సూరి, మండల వ్యవసాయ అధికారి నేదునూరి చేరాలు, ట్రాన్స్ కో ఎ.ఈ కృష్ణారావు, సీడీపీఓ ప్రేమలత, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అశోక్, ఎన్ఆర్ఈజీఎస్ ఎపీఓ అంకూస్, ఆర్డబ్ల్యూఎస్ ఎఈ యాకన్న, పీఆర్ ఎఈ నీహిత్, ఐకేపీ ఏపీఎం, ఐకేపీ సిసిలు, పంచాయతీ కారదర్శులు పాల్గొన్నారు.