భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన
ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు
ఆసిఫ్‌నగర్‌లోని గండిమైసమ్మ ఆలయంలో నిర్వహణ
హైదరాబాద్, ఆగస్టు 7(విజయక్రాంతి): ఆషాఢమాసం చివరి శుక్రవారం సందర్భంగా ఆసిఫ్‌నగర్‌లోని చారిత్రక శ్రీ గండిమైసమ్మ ఆలయంలో శుక్రవారం కుంకుమార్చనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రతి ఏడాది బోనాల ఉత్సవాలకు ముందు నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమంలో భక్తులు అమ్మవారికి కుంకుమ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. కుటుంబాల్లో సుఖశాంతులు, సౌభాగ్యం, ఆరోగ్యం కలగాలని అమ్మవారిని ప్రార్థించారు. అసిఫ్ నగర్ గ్రామదేవతగా కొలువుదీరిన గండిమైసమ్మ ఆలయానికి స్థానికంగా విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
పలువురు వీఐపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సైతం అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రద్దీ నియంత్రణ, దర్శ నం, ఇతర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.కె. సాయిబాబా, కె. శ్రీనివాస్‌రావు, జె. శ్రీనివాస్‌రావు , ఎన్.వినాయక్‌రావు, ఎ.మహేష్ కుమార్ ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.






