8 August, 2026 | 3:26 AM

నేతన్న, రైతన్నలకు కాంగ్రెస్ ప్రాధాన్యం

08-08-2026 12:00 AM

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. రైతన్నకు, నేతన్నకు కాంగ్రెస్ ప్రభుత్వం  సమాన ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం పీపుల్స్ ప్లాజాలో శుక్రవారం జరిగిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అంతకు ముందు 100కుపైగా చేనేత స్టాల్స్‌ను మంత్రి ప్రారంభించారు.

ఆగస్టు 7 నుంచి 16 వరకు చేనేత వస్త్ర ప్రదర్శన కొనసాగుతుందని, కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కార గ్రహీతలను సత్కరిస్తామని చెప్పారు. చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేతన్నలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి, వారసత్వానికి చేనేత ప్రతీకన్నారు. గద్వాల, పోచంపల్లి, నారాయణపేట చేనేతకు ప్రపంచస్థాయిలో గుర్తింపు ఉందని మంత్రి తెలిపారు. చేనేత కార్మికుల జియో ట్యాగింగ్‌లో  తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. ఏఐ ద్వారా యువతకు ఆధునిక చేనేత నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.