22 July, 2026 | 4:05 AM

పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తికి జైలుశిక్ష, జరిమానా

22-07-2026 12:00 AM

ఉప్పల్, జూలై  21 (విజయక్రాంతి) : కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలకు భంగం కలిగించి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోగా, కోర్టు ఒక రోజు సాధారణ కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూలై 20న సౌత్ కమలానగర్లోని శ్రీ సాయి సంతోషిని హాస్టల్ నిర్వాహకురాలు శ్రీమతి సంతోషిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు జి. భరత్ కుమార్ (30) హాస్టల్ వద్దకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ న్యూసెన్స్ సృష్టించాడు.

దీంతో ఫిర్యాదుదారు డయల్-100కు సమాచారం అందించగా, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం, భరత్ కుమార్ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని కూడా అసభ్య పదజాలంతో దూషిస్తూ వారి విధులకు ఆటంకం కలిగించాడు. ఈ మేరకు అతనిపై సిటీ పోలీస్ చట్టం సెక్షన్ 70(బీ) మరియు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 292 కింద పెటీ కేసు నమోదు చేశారు.

నిందితుడిని జూలై 21న కుషాయిగూడ పరిధిలోని స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు, మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లా నందు హాజరుపరచగా, కేసును విచారించిన గౌరవ మేజిస్ట్రేట్ శ్రీమతి బి. సర్వలక్ష్మి నిందితుడికి ఒక రోజు సాధారణ కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించారు. ప్రజలు శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడకుండా చట్టాలను గౌరవించాలని పోలీసులు సూచించారు.