26 March, 2026 | 3:46 PM

Breaking News

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. 24 మంది జలసమాధి.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు!   •   పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిరంతరం సరఫరా.. కొరత లేదన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌   •   మార్కాపురం బస్సు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన ఇద్దరు మృతి   •   మ‌ర్యాద ఇవ్వ‌డం లేదని అత్తమామలపై కక్ష.. ఏడేళ్ల చిన్నారిని చంపిన బావ   •   గొల్లపల్లి కొలనూరులో ద్వారక యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక   •   గ్యాస్ కోసం రోడ్డెక్కిన క్యూ లైన్   •   ఆడపిల్లకు అన్యాయం... అడిగితే అక్రమ కేసులా..?   •   తాసిల్దార్ కార్యాలయం ముందు పడిగాపులు   •   పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యత్వాల నమోదు ప్రారంభం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •  

మ‌ర్యాద ఇవ్వ‌డం లేదని అత్తమామలపై కక్ష.. ఏడేళ్ల చిన్నారిని చంపిన బావ

26-03-2026 02:34 PM

అమరావతి: అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో దారుణం చోటుచేసుకుంది. నిన్న పాఠశాల నుంచి ఇంటికి వస్తుండుగా ఏడేళ్ల చిన్నారి వేమ్ చంద్రకు మాయమాటలు చెప్పి బావ బోయ సర్వేశ్ తీసుకెళ్లాడు. వేమ్ చంద్రను హత్య చేసి కుందనకోటకొండలో పడేశాడు. కుమారుడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికిన ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాలుడిని బోయ సర్వేశ్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. చిన్నారి వేమ్ చంద్ర అక్కను బోయ సర్వేశ్ వివాహం చేసుకున్నాడు. ఉగాదికి భార్యతో కలిసి బోయ సర్వేశ్ అత్తవారింటికి వెళ్లాడు. తనకు గౌరవం ఇవ్వడంలేదని అత్త, మామాలపై బోయ సర్వేశ్ కక్ష పెంచుకున్నాడు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా తినుబండారాలు ఇప్పిస్తానని నమ్మించి సర్వేశ్ తీసుకెళ్లాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.