సీతారామ కాలువ లో పడి వ్యక్తి గల్లంతు..
16-08-2026 08:09 PM
చంద్రుగొండ, ఆగస్టు 16 (విజయక్రాంతి): మండలంలోని మద్దుకూరు గ్రామ శివారు లోనీ సీతారామ కాలువ లో ఆదివారం వ్యక్తి పడి గల్లంతు అయ్యాడు.. ప్రత్యక్ష సాక్షులు.. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. మద్దుకూరు గ్రామానికి చెందిన కుర్సం కృష్ణ(45) కూలి పనులకు వెళ్ళాడు.. సాయంత్రం సీతారామ కాలువలో కాళ్ళు కడుగుకుంటుండగా ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. అక్కడే ఉన్న పలువురు అరుస్తుండగా నీటి ఉదృతికి కొట్టుకుపోయాడు.. కృష్ణకు భార్య నీల.. ముగ్గురు కుమారులున్నారు. సమాచారం తెల్సిన పోలీస్ లు.. గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు.






