డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి
10-03-2026 09:59 PM
కొండపాక: కొండపాక మండలం పరిధిలోని రవీంద్ర నగర్ లో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. రవీంద్రనగర్‌కు చెందిన కోడెల నరసయ్య రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, హైదరాబాద్ నుంచి సిద్ధిపేటకు వెళ్తున్న TG 36 T 2033 నెంబర్ గల డీసీఎం వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
వాహనాన్ని డ్రైవర్ లక్ష్మణ్ అతి వేగంగా నడపడంతో ప్రమాదం జరిగినట్లు కుకునూరుపల్లి పోలీసులు తెలిపారు. మృతుడి మృతదేహాన్ని గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రతాప్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్, నూనె కుమార్ సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.




