ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా మల్యాల అంజయ్య నియామకం
11-08-2026 05:35 PM
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని పిప్పల్దరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్యాల అంజయ్య ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంతేగాక రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవిని కట్టబెట్టిన రాష్ట్ర అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పటిష్టతతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా తనవంతు కృషి చేస్తానన్నారు. భవిష్యత్తులో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.






