ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక
11-08-2026 06:06 PM
నస్పూర్,(విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 30వ డివిజన్ ఎమ్మార్పీఎస్ నూతన కమిటీనీ మంగళ వారం నస్పూర్ మండల ఇంచార్జిలు గద్దల బానయ్య, బచ్చల రమేష్, కో ఇంచార్జిలు గుంపుల స్వామి, కొయ్యల శేఖర్ ల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. విలేజ్ శ్రీరాంపూర్ లోని 30వ డివిజన్ అధ్యక్షులుగా రసపెల్లి రాజు, ఉపాధ్యక్షులుగా శనిగరపు రాజలింగు, ప్రధాన కార్యదర్శిగా చిప్పకుర్తి విష్ణు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా లింగంపల్లి బీమయ్యలు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంథని మల్లేష్, నక్క అంజన్న, సిరికొండ బోస్ తదితరులు పాల్గొన్నారు.






