పీఎం జేజేబీవైతో రూ.2 లక్షల పరిహారం
11-08-2026 06:13 PM
వాంకిడి,(విజయక్రాంతి): వంగపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు చెందిన ఖాతాదారుడు సెండే మోహన్‌కు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎం జేజేబీవై) పథకం అండగా నిలిచింది. పథకం కింద ఏడాదికి రూ.436 ప్రీమియం చెల్లిస్తూ బీమా తీసుకున్న మోహన్ మృతి చెందడంతో రూ.2 లక్షల బీమా పరిహారం మంజూరైంది. మంజూరైన మొత్తాన్ని మోహన్ భార్య సెండే పద్మకు బ్యాంకు మేనేజర్ వై. అనిల్, అకౌంటెంట్ ఎస్. శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ.. మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు అందిస్తున్న బీమా పథకాలతో పాటు ఇతర సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






