11 August, 2026 | 6:45 PM

వికలాంగులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి

11-08-2026 05:40 PM

ఆదిలాబాద్, (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు, వృద్ధులు, వితంతులు, కిడ్నీ లేని వారు, ఒంటరి మహిళలు కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి అరిఫా బేగం కోరారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ సుందరయ్య భవనంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని మండలాలు, గ్రామాలలోని అర్హులందరూ తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 99486 67022లో సంప్రదించవచ్చని సూచించారు.