11 August, 2026 | 7:16 PM

హర్‌ ఘర్‌ తిరంగాతో ‘వికసిత్‌ భారత్‌’ సంకల్పాన్ని చాటుదాం

11-08-2026 06:02 PM

బిజెపి నేతల పిలుపు

గణపురం ఆగస్టు11 (విజయ క్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా గణపురం మండల కేంద్రంలో విద్యార్థులతో భారీ తిరంగా యాత్ర మంగళవారం నిర్వహించారు. జాతీయ పతాకం దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని, దేశభక్తిని చాటుతూ ప్రతి పౌరుడు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ‘వికసిత్‌ భారత్‌’ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గణపురం మండల ఇన్‌చార్జి జిల్లా కార్యదర్శి శివనాత్రి వేణు, దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుప్పటి భద్రయ్య, బీజేవైఎం రాష్ట్ర నాయకులు మంద మహేష్, సీనియర్ నాయకులు మాదాసు మొగిలి గౌడ్, మాడిశెట్టి సాంబశివుడు, సోమ దామోదర్, ఒద్దుల రాందాస్, మహిళా మోర్చా నాయకురాలు బొల్లం అరుణ, గొర్రె రవి యాదవ్, జన్నె ప్రశాంత్, ల్యాదల్ల నరేష్, వేముల రమేష్ తదితరులు పాల్గొన్నారు.