11 August, 2026 | 7:15 PM

చేయూత పింఛన్ల దరఖాస్తుల పరిశీలన

11-08-2026 05:58 PM

జన్నారం, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా పోనకల్ గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన చేయూత పింఛను దరఖాస్తు ప్రక్రియను సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పింఛను దరఖాస్తుల స్వీకరణ వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పింఛను దరఖాస్తుల సమర్పణలో గ్రామస్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా లేదా సందేహాలు ఉన్నా వెంటనే జీపీలో సంప్రదించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జలపతి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి రేగొండ రాహుల్, బిల్ కలెక్టర్ అనిల్, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.