2 March, 2026 | 11:30 PM

పెద్దపల్లిలో ‘మల్లోజుల’ ప్రత్యక్షం

02-03-2026 01:35 AM

అన్నను పరామర్శించిన మావోయిస్టు మాజీ అగ్రనేత 

పెద్దపల్లి మార్చి 1 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మావోయిస్టు మాజీ అగ్రనేత ఆదివారం ప్రత్యక్షమయ్యారు. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలతో లొంగిపోయిన మావోయిస్టు మాజీ ఆగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు తన స్వగ్రామమైన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన ఇంటికి వచ్చారు. కోటేశ్వరరావు అన్న మల్లోజుల ఆంజనేయులు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా అన్నను పరామర్శించేందుకు వచ్చారు.

కోటేశ్వరరావు కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మా ట్లాడి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి లోని చిన్ననాటి మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున ఇంటికి చేరుకున్నారు. పోలీస్ భారీ బందోబస్తు మధ్య కోటేశ్వరరావు రావడంతో వచ్చిన వారిని ఆయన కలవలేకపోయారు. దీంతో ఆయన్ని కలిసేందుకు వచ్చిన చాలామంది నిరుత్సాహానికి గురయ్యారు.