2 July, 2026 | 2:55 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

మల్లాపూర్ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ కు సన్మానం

17-02-2026 09:10 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్‌ను ప్రముఖ జర్నలిస్ట్, తెలంగాణ మీడియా అకాడమీ ఏఐ జర్నలిజం శిక్షణ తరగతుల బోధకుడు ముద్దం నరసింహ స్వామి శాలువాతొ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మల్లాపూర్‌ ను జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాజకీయాలకు అతీతంగా, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఆయన సర్పంచ్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఎదులాపురం శంకర్, వ్యాపారవేత్త రుద్ర లక్ష్మిరాజం, సిరిపురం రాజు కుమార్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.