పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్‌కు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ భవన్ గేటు వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... గన్ పార్క్ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం అన్నారు. మంత్రి జూపల్లితో చర్చ కోసం గన్ పార్క్ బయలుదేరితే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచన్‌బాగ్‌కు వెళ్లి, అక్కడ అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేతలను పరామర్శిద్దామని అనుకుంటే.. గేటు నుంచి అడుగు బయట పెట్టకుండా భారీగా పోలీసులను మోహరించారని తెలిపారు. అక్కడ కూర్చుని మంత్రులు సవాళ్లు విసరడం, ఇక్కడ పోలీసులతో మమ్మల్ని అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. చర్చించడానికి దమ్ము లేకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు వెన్నుచూపి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.






