2 July, 2026 | 2:58 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

02-07-2026 02:01 PM

భారీగా నగదు, కీలక డాక్యుమెంట్ల గుర్తింపు

14 మంది అధికారులతో కొనసాగుతున్న సోదాలు

మణికొండ జూలై 2 (విజయక్రాంతి): అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ భీమ్‌రెడ్డి(DSP Bhimreddy) కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో దాదాపు 14 మంది ఏసీబీ అధికారుల బృందం ఈ తనిఖీల్లో పాల్గొంది. భీమ్‌రెడ్డి అక్రమాస్తులకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్లు అన్నీ నరేందర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు పక్కా సమాచారంతో అధికారులు ఈ దాడులు చేశారు.

ఈ సోదాల్లో ఇంట్లో భారీగా నగదు ఉన్నట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. భీమ్‌రెడ్డితో ఉన్న ఆర్థిక లావాదేవీలు, బినామీ ఆస్తుల కొనుగోళ్లకు సంబంధించిన దస్త్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చట్టానికి దొరకకుండా ఆధారాలను ఇక్కడ దాచారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దాడులతో కీలక ఆధారాలు లభిస్తుండటంతో భీమ్‌రెడ్డి కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. నరేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.