2 July, 2026 | 4:11 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

పట్టణ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా

17-02-2026 09:07 PM

మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పట్టణ అభివృద్దే లక్ష్యంగా, ఎమ్మెల్యే కోవ లక్ష్మి సహకారంతో అభివృద్ధి చేస్తానని ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ అన్నారు.  మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా ఎండీ అహ్మద్ కి మంగళవారం పట్టణంలోని సందీప్ నగర్ (ఎస్సీ కాలనీలో) కాలనీవాసులు ఆయనను శాలువాతో ఘనంగా  సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో పట్టణంలోని సమస్యలు పరిష్కారం కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు అహ్మద్ బిన్ అబ్దుల్లా, బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ నిసార్, బీజేపి ఎస్సీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు మాటూరీ జయరాజ్, బీసీ సంఘం నాయకులు కోట వెంకన్న, కాలనీవాసులు సయ్యద్ అజార్, మాటూరి కుమార్, చిలుముల నితిన్, అఖిల్, మోతే జాన్, సిహెచ్ కిరణ్, ఏం ఆదిత్య , ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.