2 July, 2026 | 3:11 PM

Breaking News

తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం

02-07-2026 02:16 PM

పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు

తంగళ్ళపల్లి జూలై 2 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని పార్టీ అధిష్ఠానం నియమించింది. సారాంపల్లి గ్రామానికి చెందిన మునిగెల రాజును తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్, అలాగే మాజీ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మరియు మునిగెల రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, కార్యకర్తలను సమన్వయం చేసుకుని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని మునిగెల రాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు.