గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్
బోథ్,జూలై 2 (విజయక్రాంతి): గోండు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని భవిష్యత్తు తరాలకు భాషను అందించడమే లక్ష్యంగా పాటుపడాలని ఐటిడిఏ ఏపీవో మాత్రం భాస్కర్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని పాట్నాపూర్ గ్రామంలో రాయి సెంటర్ సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న గోండి భాషను పరిరక్షించేందుకు 20 పదాలతో రూపొందించిన పుస్తకం అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు.
వై సిటీ ద్వారా జరిగే ట్రైనింగ్ సెంటర్లను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఐదుగురు సభ్యుల తో కూడిన యూత్ స్పెషల్ యాప్ ద్వారా పుస్తకాన్ని అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు విద్యార్థులను పాఠశాలకు పంపే బాధ్యత వారి తల్లిదండ్రులదేనని పేర్కొన్నారు కార్యక్రమంలో సర్పంచ్ పంద్రం సుగుణ సార్ మేడి ఆడేం భీమ్రావు న్యాయవాది పందరం శంకర్ ఉప సర్పంచ్ ఆత్రం మోహన్ పటేల్ తురసం నీలకాంతరావు మాజీ సర్పంచ్ తొడ సం గోపాల్ ప్రధానోపాధ్యాయులు శేఖర్ గ్రామస్తులు పాల్గొన్నారు






