2 July, 2026 | 3:29 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ

02-07-2026 02:38 PM

తంగళ్ళపల్లి,జూలై 2(విజయక్రాంతి): తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అరెస్టును టీఆర్ఎస్ రాజన్నసిరిసిల్ల జిల్లా సీనియర్ మహిళా నాయకురాలు చెరుకుపల్లి శైలజ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నం చేస్తోందని ఆమె విమర్శించారు. భూపోరాటం సందర్భంగా కవితను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని, ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఆమె బండరాళ్లపై పడటంతో గాయాలయ్యాయని శైలజ పేర్కొన్నారు.

అనంతరం పోలీసు వాహనం వద్దకు తీసుకెళ్లే సమయంలో కూడా ఆమెకు గాయాలయ్యాయని ఆరోపించారు.ప్రజాస్వామ్య దేశంలో ప్రజల తరఫున పోరాడే నాయకులను ఈ విధంగా వ్యవహరించడం బాధాకరమని శైలజ అన్నారు. ఉద్యమాలను అణచివేయడం ద్వారా ప్రజల స్వరాన్ని అడ్డుకోలేరని, ప్రజా సమస్యలపై పోరాటాలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులపై అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, ఇందుకు తగిన సమయంలో ప్రజలే సమాధానం చెబుతారని చెరుకుపల్లి శైలజ పేర్కొన్నారు.