06-02-2026 12:00:00 AM
ఐఎఫ్‌టీయూ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివబాబు
జవహర్ నగర్, ఫిబ్రవరి 5,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను నిరసిస్తూ చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలని ఐఎఫ్‌టీయూ మేడ్చల్ జిల్లా ప్ర ధాన కార్యదర్శి శివబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధి జవహర్ నగర్ కార్యాలయంలో శివబాబు ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించే దేశవ్యాప్త సమ్మె వాల్ పోస్టర్‌ను మున్సిపల్ కార్మికులతో కలిసి గురువారం ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా శివబాబు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు అందజేయాలని, జీవో 60ను యాథావిధిగా అమలు చేసి 8గంటల పనిదినాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనురాధ, జయసుధ, రా ములు, వెంకటమ్మ, రేణుక, ఎల్లేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.