3 April, 2026 | 2:44 AM

సీఎం సభను విజయవంతం చేయండి

03-04-2026 01:08 AM

ఖానాపూర్‌ను అభివృద్ధి చేసి చూపిస్తాం

ఎమ్మెల్యే, డీసీసీ అద్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ 

ఖానాపూర్,ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శనివారం తలపెట్టిన సీఎం పర్యటనను ప్రజలు విజయ వంతం చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే ,డిసిసి అధ్యక్షులువెడ్మ బొజ్జు పటేల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు .పర్యటనలో భాగంగా జిల్లా కాం గ్రెస్ కమిటీ సభ్యులకు ప్రమాణ స్వీకారం అనంతరం పర్యటన కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు.

దీనికి జిల్లాలోని నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చారు .కాగా ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, కొందరు వ్యక్తులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో అబద్ధపు ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసం దుర్బుద్ధితో కొందరు ఖానాపూర్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఉట్నూ ర్‌కు తరలించుకుపోయానని ఆరోపిస్తున్నారు ఇది సరికాదని, ఈనెల ఆరవ తేదీ తర్వాత 110 ఎకరాల్లో అసైన్డ్ భూ ములు ఎంత ఉందో అధికారులతో సర్వే చేసి ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని, అక్రమంగా భూమి ఆక్రమించుకున్న వారిని తొలగిస్తానని ఆయన అన్నారు.

దాని స్థానంలో ఖానాపూర్ కి మోడల్ పాఠశాల, అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్, డిగ్రీ కళాశాల, మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కి విన్నవించానని త్వరలోనే వాటికి కూడా మంజూ రు లభిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 4న ఎన్నికల్లో చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని, ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ కిడ్నాప్ ఉదంతంపై తమకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు రాజురా సత్యం, నిమ్మల రమేష్, గొర్రె గంగాధర్, జమాల్, తోట సత్యం, దయానంద్, షబ్బీర్ పాష, శంకర్ తదితరులు ఉన్నారు.