28 May, 2026 | 4:19 AM

బీజేపీ భరోసా యాత్రను జయప్రదం చేయండి

28-05-2026 12:30 AM

నిర్మల్ మే 27 ( విజయక్రాంతి)ఆరుగాలం శ్రమించి పంట పండిస్తున్న రైతన్నకు అండగా బీజేపీ రైతు గోస బిజెపి భరోసా గురువారం నిర్మల్ జిల్లాలో నిర్వహిస్తున్నట్లు బిజెపి నాయకులు సత్యం చంద్రకాంత్ తెలిపారు. బి జె ఎల్ పి నేత మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో ఈ యాత్ర సోను మామడ సారంగాపూర్ మండలాల్లో కొనసాగించి సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ ఉంటుందన్నారు. యాత్రలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు రైతుల పక్షాన నిరంతరం పోరాడుతున్న మహేశ్వర్ రెడ్డికి మద్దతుగా రైతులు ఉండాలన్నారు.

నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, జిల్లా కార్యదర్శి నర్సారెడ్డి, జిల్లా నాయకులు న్యూ వెల్మల్ సర్పంచ్ సాగర్, సొన్ నర్సాపూర్ మండలాల అధ్యక్షులు మార గంగారెడ్డి, నరేందర్, పట్టణ కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజీ నరేష్, అర్జున్, పట్టణ నాయకులు జుట్టు దినేష్, శ్రీకాంత్ రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.