ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
27-08-2026 03:23 PM
బెజ్జంకి, ఆగస్టు 27: యాదగిరిగుట్టలో నిర్వహించనున్న అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ బెజ్జంకి మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్(Dontharaveni Mahesh) యువతకు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహాసభల గోడపత్రికలను జిల్లా మాజీ అధ్యక్షుడు బోనగిరి శ్రావణ్(Bonagiri Shravan)తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్య, ఉపాధి, ఉద్యోగ సమస్యలపై మహాసభల్లో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అంతటి రాకేష్, ఉపాధ్యక్షులు రోడ్డ లక్ష్మణ్, శంకర్, మధు, సుమంత్, వడ్లూరి మల్లేశం, రమేష్ తదితరులు పాల్గొన్నారు






