అల్ఫోర్స్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
27-08-2026 05:00 PM
కొత్తపల్లి,(విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ- టెక్నో పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భారత దేశంలో రక్షాబంధన్ పండుగకు ప్రత్యేకత ఉన్నదని, మతసామరస్యాన్ని, సోదర భావాన్ని సైతం పెంపొందిస్తుందన్నారు. సోదరులు సోదరీమణులకు అండగా నిలుస్తామని, ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారని, ఇది గొప్ప సాంప్రదాయమని చెప్పారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






