పండుగ పూట పైపైకి.. చేదెక్కిన చక్కెర... కన్నీళ్ళు పెట్టిస్తున్న ఉల్లి
27-08-2026 04:51 PM
కరీంనగర్,(విజయక్రాంతి): ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉల్లి ధరలు అమాంతం పెరిగాయి. రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతున్నాయి. దిగుమతులు తగ్గడం సరఫరాలో అంతరాల కారణంగా సామాన్యుల బడ్జెట్ పై తీవ్ర భారం పడుతోంది. పంచదార కిలో ధర రూ.70 నుంచి రూ.75 వరకు ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి మార్కెట్లకు లారీల రాకపోకలు తగ్గడం. కొత్త పంట రాక ఆలస్యం కావడం. నిల్వలు తగ్గి డిమాండ్ పెరగడంతో పండుగపూట సామాన్యుని పై మోయలేని భారం పడినట్టు అయ్యింది.






