17 April, 2026 | 8:16 PM

లక్ష్మణ చందాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

17-04-2026 06:56 PM

లక్ష్మణ చందా,(విజయక్రాంతి): మండల కేంద్రంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో గురువారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సోమభీమ్ రెడ్డి మాట్లాడుతూ" రైతులందరూ దళారులకు  అమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మక్కలు అమ్ముకొని మద్దతు ధర పొందాలని రైతులను కోరారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఆత్మ కమిటీ అధ్యక్షులు రామ్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు ఈటెల శ్రీనివాస్ లక్ష్మణ చాందా సర్పంచ్ ఓస కవిత రాజు మాజీ డిసిసిబి ఉపాధ్యక్షులు రఘునందన్ రెడ్డి మాజీ జెడ్పిటిసి రాజేశ్వర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుంకరి సురేష్ ఆత్మ కమిటీ డైరెక్టర్ సమ్మెట రవి మండల నాయకులు కొండ నరేష్ రెడ్డి అబ్బడి ప్రతాపరెడ్డి అద్వాల రమేష్ బిట్లింగ్ రజినీకాంత్ కల్లెడ భూమన్న వెంకటి సిర్ర లింగన్న ముద్రబోయిన వినేష్ రవి పిఎసిఎస్ స్పెషల్ ఆఫీసర్  ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఏఓ & ఏఈపీ, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు