15 June, 2026 | 8:00 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

పొంగులేటిపై చర్చకు సిద్ధం— హరీష్ ఆధారాలతో రావాలి— టీపీసీసీ చీఫ్ సవాల్

09-04-2026 03:24 PM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) హెచ్చరించారు. గాంధీభవన్ లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఎమ్మెల్యేలు అంతా ఎన్నుకున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదని ఆరోపించిన ఆయన భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసి పోతాయని సూచించారు.

రాష్ట్ర మంత్రులపై విమర్శలు చేసేవాళ్లు ఆధారాలు తీసుకురావాలని సవాల్ విసిరారు. మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధమని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేత హరీశ్ రావు వద్ద ఆధారాలు ఉంటే తీసుకురాలని డిమాండ్ చేశారు. పునర్విభజనకు సంబంధించి ఎప్పుడు చేసే పద్ధతికి తాము వ్యతిరేకమన్నారు. దక్షిణ భారత్ కు అన్యాయం జరగకూడదనే వ్యతిరేకిస్తున్నామని వివరించారు. జనాభా ఆధారంగా చేస్తే దక్షిణ భారతదేశం నష్టపోతుందని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు.