22 April, 2026 | 1:58 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

22, 24వ వార్డుల్లో పోషక పక్వాడ కార్యక్రమం నిర్వహణ

09-04-2026 03:26 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందు పట్టణం 22, 24వ వార్డుల్లో నిర్వహించిన పోషక పక్వాడ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లు కొర్లపాటి శివ కిరణ్, శనిగారపు శృతి పాల్గొని మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారన్నారు.  రక్తహీనత, పోషకాహార లోపం నివారణకు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు, పిల్లల ఎదుగుదలలో సమతుల్య ఆహారం, శుభ్రత ముఖ్యమని తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ ధనలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు సక్కుబాయి, సరస్వతి, అరుణకుమారి, ఆశా వర్కర్ కరుణ తదితరులు పాల్గొన్నారు.