11 April, 2026 | 5:51 PM

Breaking News

సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిభాపూలే   •   అక్షరాయుధంతో అణచివేతపై పోరాడిన ధీశాలి పూలే   •   జెక్ కాలనీలో చలివేంద్రం ప్రారంభం   •   తల్లి జ్ఞాపకార్థం మున్సిపల్ కార్మికులకు టిఫిన్ బాక్సులు అందజేత   •   CAA అమలు వేగవంతం— చొరబాటుదారులు సామాన్లు సర్దుకోవాల్సిందే! మోదీ హెచ్చరిక   •   విద్యా విప్లవానికి నాంది..   •   సామాజిక సమస్యలపై కార్మిక వర్గం పోరాడాలి   •   యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలి   •   సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్పు విజయ రమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం   •   ఇరాన్‌ కండిషన్స్‌కు ఒప్పుకున్న అమెరికా   •  

మల్లాపూర్‌లో జ్యోతిరావు ఫూలే జయంతి

11-04-2026 04:04 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలో ముత్యంపేట గ్రామంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ సింహాసేన ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సింహాసేన సభ్యులు మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే సామాజిక అసమానతలపై అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు. అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఫూలే చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.