సనత్‌నగర్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి వేడుకలు
సనత్‌నగర్,ఏప్రిల్ 11 (విజయక్రాంతి): భారతదేశపు అగ్రగణ్య సామాజిక సంస్కర్త, విద్యావేత్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి ద్విశతాబ్ది జయంతి సందర్భంగా సనత్‌నగర్ డివిజన్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.బీజేపీ ఆధ్వర్యంలో చౌక్ నెహ్రూ పార్క్ వద్ద ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ కన్నూరి చంద్రకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహంకాళి, సికింద్రాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు బూర్గుల శ్యామ్ సుందర్ గౌడ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా పూలే గారి సేవలను స్మరించుకుంటూ, సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని నాయకులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లింగంపల్లి నర్సింగ్ రావు, దయానంద్, కన్నూరి క్రాంతికుమార్, సిర్మనీ నరేష్ ముదిరాజ్, ఆకుల మహేష్, తైలం ప్రీతం, రావుల లక్ష్మి నారాయణ, జీ వి సుమన్ కుమార్, ఆకూరి శ్రీనివాస్ రావు, హృషికేష్, పవన్ కుమార్, అశ్విని, శివ ప్రసాద్, రొంపి ఐలయ్య, అమరం శ్యామ్, వంశీ కృష్ణ, రాచకొండ లక్ష్మణ్, నక్క శ్రీనివాస్ గౌడ్, కొత్తపల్లి రాజు గౌడ్, అనుదీప్ రెడ్డి, సుధాకర్ ముదిరాజ్, స్వప్నా గుప్తా, మాధవి, లక్ష్మి, ఠాకూర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు




