మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి
గోపాలపేట: మహాత్మ జ్యోతిరావు పూలే 19వ జయంతిని గోపాలపేట మండల కేంద్రంలోని ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా వనపర్తి జిల్లా గోపాల్ పెట మండలంలోని తాడిపర్తి బుద్ధారం గ్రామంలో కూడా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల్లో విద్య విజ్ఞానం పెంకుందించాలన్న గొప్ప సంకల్పమున్న జ్యోతిరావు పూలే దంపతులు అన్నారు.
అదేవిధంగా మేధావులు విద్యావంతులు వారిని ఎంతో గొప్పగా కొనియాడారు. కార్యక్రమంలో బుద్ధారం సర్పంచ్ డాక్టర్ శేఖర్ అయ్య గౌడ్ గోపాల్పేట సర్పంచ్ స్వప్న భాస్కర్, బుద్దారం గ్రామ అంబెడ్కర్ విజ్ఞాన సేవా సంఘము అధ్యక్షులు రాము, కార్యదర్శి రాముడు ఉపసర్పంచ్ శివాజీ, వెంకటయ్య, చంద్రయ్య, బిళ్ళకంటి రాజు, విష్ణు, రాజు, రవి, ఓంకార్, అమర్నాథ్, వెంకటేష్, కుర్మయ్య, సంగం రవి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




