11 April, 2026 | 4:21 PM

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

11-04-2026 02:45 PM

మానకొండూరు,(విజయక్రాంతి): గ్రామ ప్రజలు ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కెల్లేడు గ్రామ సర్పంచ్ ఆడెపు రజిత విజయ్ గ్రామ ప్రజలను కోరారు. శనివారం మండలంలోని కెల్లేడు గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో ప్రాథమిక వైద్య కేంద్రం వెల్ది ఆధ్వర్యంలో  వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఆడెపు రజిత విజయ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తు చేస్తూ గ్రామ ప్రజలంతా ఆరోగ్యంపై శ్రద్ధ వహించి తమ ఆరోగ్యాల్ని కాపాడుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మాతంగి సహదేవ్, 5వ వార్డ్ సభ్యులు దాసరి అంజలి చంద్రయ్య, ప్రభుత్వ వైద్య అధికారులు, ఆశ కార్యకర్తలు, సిబ్బంది మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.