24 August, 2026 | 11:36 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు ఓరియంటేషన్

08-07-2026 02:00 AM

నల్లగొండ టౌన్, జూలై 7 :స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సర విద్యార్థినులకు మంగళవారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ కే.శ్రీనివాసరాజు మాట్లాడుతూ డిగ్రీ సెమిస్టర్ విధానం, సీబీసీఎస్ క్రెడిట్ సిస్టం, బోధనేతర కార్యక్రమాలపై అవగాహన కల్పించడమే ఉద్దేశమని తెలిపారు 3 ఏళ్ళ డిగ్రీలో కష్టపడి చదవడంతో పాటు నూతన నైపుణ్యాలు నేర్చుకొని పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలని సూచించారు.

కళాశాల దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్. రాజారామ్ మాట్లాడుతూ డిగ్రీ విద్య అనేది వ్యక్తిత్వ వికాసానికి, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి గొప్ప అవకాశమన్నారు. గ్రంథాలయంలో పోటీ పరీక్షల పుస్తకాలు, వివిధ పత్రికలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కే. మంజుల, డాక్టర్ దయానంద్, డాక్టర్ వసంత, డాక్టర్ వై. సునీత, డాక్టర్ సాలయ్య, డాక్టర్ రవి, డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ కె. వెంకటకృష్ణ, డాక్టర్ అమరావతి, డాక్టర్ సంధ్య, డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ అరవింద, డాక్టర్ పుష్పలత, డాక్టర్ వై. విరామారావు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.