8 July, 2026 | 2:58 AM

యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డు సాధించిన స్టెమ్స్పార్క్ రెజొనెన్స్ విద్యార్థిని రిషిత

08-07-2026 02:00 AM

ఖమ్మం హెల్త్ (విజయక్రాంతి): ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని స్టెమ్స్పార్క్ రెజొనెన్స్ స్కూల్ విద్యార్థిని బొడ్డు రిషిత యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డు సాధించింది. క్లాసికల్ నైట్లో భాగంగా నిర్వహించిన భరతనాట్యంకూచిపూడి వరల్ రికార్డు పోటీలో ఆమె 30 నిమిషాల పాటు నిర్విరామంగా కూచిపూడి నృత్యం చేసి ఈ ఘనతను అందుకుంది.

ఈ సందర్భంగా రికార్డు సంస్థ ప్రతినిధులు ఆమెకు సర్టిఫికెట్, మెడల్ అందజేశారు. స్కూల్ డైరెక్టర్ కొండా శ్రీధర్ రావు రిషితను అభినందిస్తూ భవిష్యత్తులో గిన్నీస్ రికార్డు కూడా సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.