మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన ఎంఐఎం
ముకరంపుర,(విజయక్రాంతి): బీహార్ కు చెందిన ముంతాజ్ ఆలం (38) అనే టైల్స్ కార్మికుడు కరీంనగర్ పట్టణంలోని ముకరంపుర ప్రాంతంలో తన కుటుంబంతో నివాసముంటున్నాడు. శుక్రవారం ఉదయం కరీంనగర్ లో రోజువారిగా టైల్స్ పరిచే పనికి వెళ్లగా సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు అనుమాదాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఎంఐఎం అధినేత అసదొద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు, బీహార్ రాష్ట్ర ఎంఐఎం అధికార ప్రతినిధి ఆదిల్ హసన్ సూచనల మేరకు ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, 59వ డివిజన్ ముకరంపుర కార్పొరేటర్ మాజిద్ హుస్సేన్ తో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
మృతుడు పని చేస్తున్న ఇంటి ఓనర్ తో మాట్లాడి బాధిత కుటుంబానికి రూ.2లక్షలు సాయం అందించే విధంగా కృషి చేశారు. ఇంతేగాక ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ రూ.10వేల నగదును, గోదాం గడ్డ కు చెందిన సోషల్ వర్కర్ అబ్దుల్ గఫ్ఫార్ లయన్ రూ.10వేల నగదును వేర్వేరుగా ఆర్థిక సాయం అందించి, మానవతకు మారుపేరుగా నిలిచారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈకార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, తదితరులు పాల్గొన్నారు.




