20 April, 2026 | 5:46 PM

మహాత్మ బసవేశ్వర జయంతి

20-04-2026 04:16 PM

మహాబాబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో విశ్వగురు శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి (అక్షయ తృతీయ) వేడుకలు సోమవారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా బసవేశ్వర లింగాయత సాంప్రదాయ స్థాపకుడని, సమానత్వం న్యాయం భక్తికి బలమైన ప్రతిపాదకుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, వసతి గృహ సంక్షేమ అధికారులు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.