6 July, 2026 | 6:09 PM

ఎంఆర్పీఎస్-ఎంఎస్పీ ఆధ్వర్యంలో బాబు జాగ్జీవన్ రామ్ వర్ధంతి

06-07-2026 05:00 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్ల మండల కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ఎం.ఎస్.పి ఆధ్వర్యంలో భారత దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,దేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తర్వాత బడుగు బలహీన వర్గాలను నిమ్న వర్గాలకు, అణగారిన వర్గాలకు అండగా నిలిచి భారత దేశంలోనే దళిత మాజీ ప్రధానిగా మంచి పేరు సంపాదించిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అన్నారు.