20 April, 2026 | 5:41 PM

నాగర్‌కర్నూల్‌లో వైద్యుల సంఘం ఎన్నికలు.!

20-04-2026 04:13 PM

- అధ్యక్ష పదవికి ఇద్దరు పోటీ

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టిజిజిడిఏ – మోడ్రన్ మెడిసిన్) నాగర్‌కర్నూల్ యూనిట్‌ 2026–2028 పదవీకాలానికి సంబంధించిన నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొత్తం 19 నామినేషన్లు దాఖలై, అవన్నీ చెల్లుబాటు అయ్యాయని రిటర్నింగ్ అధికారి డా. ఎస్. రాజేష్ గౌడ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అధ్యక్ష పదవికి ఇద్దరు అభ్యర్థులు డా.వి.శేఖర్, డా.ఆర్.రఘు నామినేషన్లు దాఖలు చేశారు. రేపటితో ఉపసంహరణ గడు కూడా పూర్తికాగా ఏకగ్రీవం అవుతుందా లేక ఈనెల 29న ఎన్నికలు జరుగుతాయా అన్న ఉత్కంఠ నెలకొంది. మిగిలిన కమిటీ జనరల్ సెక్రటరీగా డా. జె. శివరామ్, కోశాధికారిగా డా. కె. శంకర్ ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు.

జనరల్ కౌన్సిల్ సభ్యులుగా డా. మొహమ్మద్ సిరాజుద్దీన్, డా.ఎ.రోహిత్ కుమార్, డా.ఎం.లక్ష్మణ్, వైస్ ప్రెసిడెంట్లుగా డా.బి.కోటేశ్వర్, డా.బి.సూర్యనారాయణ, డా.మధుసూదన్; జాయింట్ సెక్రటరీలుగా డా.కోత హరిప్రియ, డా.జె. విష్ణు, డా.కె.మణి ప్రకాశ్ లు ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. యూనిట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా డా. ఎం. రాజేష్ కుమార్, డా. డి. బాల్ సింగ్, డా. ఎస్. మోతిలాల్, డా.జి.వీణ, డా.డి.లలిత్, డా.కె.నజీముద్దీన్ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈనెల 21 సాయంత్రం 5 గంటల వరకు ఉండగా, అవసరమైతే ఎన్నికలు ఈనెల 29న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.