6 July, 2026 | 5:38 PM

కొన్ని పొరపాట్ల వల్ల అధికారం కోల్పోయాం

06-07-2026 04:41 PM

హైదరాబాద్: కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) పాలనలో రైతులు, పారిశ్రామిక వేత్తలు సుభిక్షంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా బాగుండటంతో పరిశ్రమలు అభివృద్ధి చెందాయని కేటీఆర్ సూచించారు. పార్టీ చేసిన కొన్ని పొరపాట్ల వల్ల అధికారం కోల్పోయామని కేటీఆర్ వివరించారు. అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు ప్రేమ, ఆదరణ తగ్గలేదని తెలిపారు. కష్టకాలంలో తమతో ఎవరు నిలిచారో, ఎవరు దూరమయ్యారో తెలిసిందన్నారు. ఎస్ఐఆర్ పై పార్టీ కమిటీతో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఎస్ఐఆర్ ప్రక్రియ, తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో చర్చించారు.