6 July, 2026 | 6:08 PM

రెండవ ఏఎన్‌ఎంల ధర్నా

06-07-2026 05:05 PM

నిర్మల్,(విజయక్రాంతి): రెండవ ఏఎన్‌ఎంల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. 2024లో రెండవ ఏఎన్‌ఎంల నియామకాల కోసం నిర్వహించిన రాత పరీక్ష మెరిట్ జాబితాను వెంటనే విడుదల చేసి నియామక ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్‌సీడీ (NCD) ఆన్‌లైన్ విధానాన్ని రద్దు చేసి, పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. రెండవ ఏఎన్‌ఎంల ఈపీఎఫ్, పీఎఫ్ సొమ్మును ప్రతి నెల ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో సక్రమంగా జమ చేయాలని, ఉద్యోగ బాధ్యతలకు సంబంధం లేని పనులను అప్పగించడం నిలిపివేయాలని కోరారు. ధర్నా అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.