ఎమ్మెల్యే పాయంను కలిసిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రమేష్ బాబు
06-07-2026 05:18 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఓరుగంటి రమేష్ బాబు సోమవారం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రమేష్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు. మండలంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






