20 April, 2026 | 4:03 PM

మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు

20-04-2026 02:59 PM

నిర్మల్,(విజయక్రాంతి): జగ జ్యోతి మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, రెవిన్యూ కలెక్టర్ కిషోర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాత్మ బసవేశ్వర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. 12వ శతాబ్దంలో మహాత్మా బసవేశ్వర్ ఓ మహోన్నత కుటుంబంలో జన్మించి అన్ని వర్గాల అభ్యున్నతికి అనేక సంఘసంస్కరణలను చేపట్టడం జరిగిందని తెలిపారు.

సాంఘిక దురాచార్లతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరు ఒకటేనన్న భావన కల్పించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, పరిపాలన అధికారి ఖాళీ, వీరశైవ లింగాయత్ మహారాజ్ సరస్వతి ఆనంద్ మహారాజ్, జిల్లా అధ్యక్షులు శంకర్ పటేల్, గౌరవ అధ్యక్షులు గంగాధర పటేల్, ఉపాధ్యక్షులు సాయినాథ్ పటేల్, ప్రధాన కార్యదర్శి గణేష్ పటేల్, నిర్మల్ పట్టణ అధ్యక్షుడు దత్తు, మాజీ జిల్లా అధ్యక్షులు కామన పటేల్, యూత్ అధ్యక్షులు సాయినాథ్ పటేల్, జంగం సంఘం అధ్యక్షుడు వీరయ్య లక్ష్మణ్ ఈశ్వరప్ప వీరశైవ లింగాయత్ బంధువులు పాల్గొన్నారు