20 April, 2026 | 4:04 PM

గంగపుత్ర సంఘం నిరసన

20-04-2026 02:56 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన జాబితాలో గంగపుత్ర సంఘం పేరు లేకపోవడం దారుణమని బెల్లంపల్లి పట్టణ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు వంగల చక్రపాణి, కార్యదర్శి దామెర విజయ్, మాజీ అధ్యక్షుడు బాసబోయిన పోతరాజులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీఏ జాబితాలో తమ సంఘం మొదటి సీరియల్ నెంబర్ లో అధికారికంగా ఉన్నప్పటికీ కులగణనలో లేకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉండే అగ్నికుల క్షత్రియ అనే జాబితాలో గంగపుత్రులను చేర్చారని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ బీసీ ఫిషరీస్ కోపరేటివ్ చైర్మన్ మెట్టు సాయికుమార్లు స్పందించి తమ సంఘాన్ని గుల గణన జాబితాలో చేర్చే విధంగా కృషి చేయాలని కోరారు.

లేనిపక్షంలో గంగపుత్ర కులస్తులందరూ రాష్ట్రవ్యాప్తంగా ఏకమై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దామీర సదానందం, ప్రధాన కార్యదర్శి మాదరబోయిన మల్లేష్, కోశాధికారి పెద్దపల్లి రామస్వామి, మాజీ ఉపాధ్యక్షుడు బాసబోయిన యుగేందర్ కార్యవర్గ సభ్యులు జీదుల రాములు, మాదరపోయిన గోపాల్, ముద్రగడ వెంకటి, పెద్దపల్లి మల్లయ్య, గరిగె రాజ్ కుమార్, రాసకట్ల శంకర్, జీదుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.