20 April, 2026 | 4:29 PM

పాము కాటుతో వ్యక్తి మృతి

20-04-2026 03:02 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని జెకె నగర్ లో ఏనుగుల రాజేశ్వర్(50) అనే వ్యక్తి పాము కాటు గురై చనిపోయిన సంఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది .బంధువులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి రెండు గంటలకు జెకె నగర్ లో గల తన స్వగృహం లో కింద నేలపై నిద్రిస్తున్న తరుణంలో ఇంటిలో మాటు వేసిన పాము కాటు వేయడంతో చనిపోయినట్లు తెలిపారు.

మృతునికి వృద్ధాప్యంలో ఉన్న తల్లి భార్య ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నట్లు తెలిపారు. మృతుడు ఖానాపూర్ లో అందరితో కలివిడిగా ఉండడం, స్పోర్ట్స్, ఇతర ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ కలిగి చాలామంది యువతను ప్రోత్సహించడం, ఇటీవల హైటెక్ సిటీ కాలనీలో షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం నిర్మించి క్రీడలను ప్రోత్సహించిన తీరు తెన్నులతో పట్టణంలోని ప్రజలు ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. సంఘటన తెలుసుకొని పట్టణవాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.