calender_icon.png 5 February, 2026 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు వచ్చినప్పుడు ఏడుపు గుర్తుకు వచ్చిందా

05-02-2026 03:47:24 PM

  1. - మీ వల్ల ఎంతోమంది క్షోభను అనుభవించిన్రు 
  2. - అధికారంలో ఉన్నప్పుడు ఆశించిన అభివృద్ధి చేయాలె
  3. - గప్పుడు కెసిఆర్ తో ఏడ్చి అభివృద్ధి చేస్తే బాగుండేది
  4. - ప్రజలకు మంచి చేయాలని తపన మీ మనసులో లేదు
  5.  విలేకరుల సమావేశంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ఎన్నికలు జరుగుతున్నప్పుడే ఏడుపు గుర్తుకు వచ్చిందా అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ ను చూసి ఏడవడం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధి అంటే మేమే చేసినట్టు మా తర్వాతే మరెవరైనా అనుకునేలా ఊహించుకుంటున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు.

గడిచిన పదెలలో మీ అధికారం ఉన్నప్పుడు ఎంతోమంది ఎన్నో విధాలుగా క్షోభకు గురిచేశారని అప్పుడు వారి ఏడుపు మీకు గుర్తుకు రాలేదా? అన్నారు. కెసిఆర్ ను ఎంపీగా చేసి వారికి రాజకీయ బిక్ష పెట్టిన పాలమూరు జిల్లా అభివృద్ధిని మరిచి పదేళ్లు కాలం గడిపారని విమర్శించారు. వనపర్తి జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల తీసుకుపోయినప్పుడు కేసీఆర్ దగ్గరికి వెళ్లి ఏడ్చి పాలమూరు జిల్లాకు మరో ఇంజనీరింగ్ కళాశాల ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నించారు. ఏదో తెలిసి తెలియని కాయలు తీసుకువచ్చి అది వచ్చింది ఇది వచ్చిందంటూ ప్రజలను మభ్యపెట్టి కాలం గడిపింది నువ్వు కాదా? అని అసహనం వ్యక్తం చేశారు.

ప్రధాన రోడ్డు ఒకటి అక్కడ ఇక్కడ రంగులు వేసి బాగుచేసి నట్లు కలరింగ్ ఇచ్చుకుంటే జనం నివాసముండే ప్రాంతాలలో అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అమరేంద్ర రాజు కుటుంబ సభ్యులతోపాటు బుజ్జి సుధాకర్ రెడ్డి, ఉద్యమకారుడు రాజేందర్ రెడ్డి, మున్నూరు రవి లతోపాటు ఎంతో మందిని నాన్న రకాలుగా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు ఏడ్చి ఎవరిని మభ్యపెడతామని అనుకుంటున్నారన్నారు. సిద్దిపేట, గజ్వెల్, సిరిసిల్ల లలో ఎప్పుడో అండర్ డ్రైనేజ్ పనులు పూర్తి చేశారని అప్పుడు కేసీఆర్ దగ్గరికి వెళ్లి ఏడ్చి పాలమూరుకి ఎందుకు అండర్ డ్రైనేజీకి చేయలేదని ప్రశ్నించారు.

కేవలం మాయమాటలు చెప్పి ప్రజలను మమపెట్టి ఎలాగో ఒకలా గెలవాలని తపన ఉండడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జ్యోతిరావు బాపులే తో పాటు ఎందరో మహానుభావులు పేదరికం తలారత మారాలంటే చదువు ఒక్కటే మార్గమని చెప్పిన ఎందుకు ఆ దిశగా అడుగులు వేయలేదు చెప్పాలన్నారు. భార్యాభర్తలు మాట్లాడుకుంటే వారి మాటలను ఇన్ని ట్యాంపరింగ్ చేశారాని, చట్టం తన పని తను చేసుకోపోతుందన్నారు. ప్రజలు వాట్స్అప్ కాల్ కాకుండా నేరుగా మాట్లాడుకునే సౌకర్యం ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన తర్వాతనే సాధ్యమైందన్నారు. 

అందరి భవిష్యత్తు బాగుండాలన్నదే మా తపన : ఎమ్మెల్యే

అందరి భవిష్యత్తు బాగుండాలనే మా తపన అని ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రూ 603 కోట్లు నిధులను ఖర్చు చేసి మహబూబ్ నగర్ లో అండర్ డ్రైనేజీ పండ్లను చేపడుతున్నామని, ఇలా కోట్లాది రూపాయలను ఖర్చు చేసి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. కళాశాలలో వసతి గృహాలలో సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా గత ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజా ప్రభుత్వము ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పనిచేస్తుందని ఏదో మాయమాటలు చెప్పి కాలం గడిపే పరిస్థితి లేదన్నారు.

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏడవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసిందని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. మాజీ మంత్రి ఏడిస్తే ఎందుకు ప్రజలు నవ్వుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది అన్నారు. ఇప్పటికైనా విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప ఇలా ప్రలోభాలకు గురి చేయాలనుకోవడం సరికాదు అన్నారు. ట్యాంక్ బండ్ అసంపూర్తిగా నిర్మించి ఆ కాంట్రాక్టర్ నిధులు ఇవ్వకుంటే ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి తాను వారిని ఆదుకోవడం జరిగిందన్నారు. కలెక్టరేట్ ఉన్నచోట ఆసుపత్రి ఆసుపత్రి ఉన్నచోట కలెక్టరేట్ కట్టాలని ఆలోచన కేవలం మీ భూముల కోసమే వచ్చిందని విమర్శించారు.

ప్రజలకు మంచి చేయాలని ఆలోచన అతనికి లేదని కేవలం కాలం గడపాలి అంగుహార్ బాటలు చేయాలి జై శీనన్న అంటూ నినాదాలు చేయాలి తప్ప మరేది లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్-2047 లక్ష్యంతో పని చేస్తున్నారని ఆ లక్ష్యానికి అనుగుణంగా మనందరం శ్రమించి అడుగులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబెద్దుల కొత్వాల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అమరేందర్ రాజు, చంద్రకుమార్ గౌడ్. ప్రచార కార్యదర్శి బెనహర్ తదితరులు ఉన్నారు.