calender_icon.png 5 February, 2026 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ రెడ్డి సీఎo తెలంగాణకా.. ఆంధ్రాకా

05-02-2026 03:50:21 PM

  1. ఏపీ ఉద్యోగుల బదిలీలపై భగ్గుమన్న నిరసనలు
  2. తెలంగాణ యువతకు అన్యాయం  ఏపీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ వరం
  3. ఉద్యోగాలే లక్ష్యంగా తెచ్చుకున్న తెలంగాణలోఇతర రాష్ట్రాలకు దానం చేస్తున్న సీఎం
  4. 1943 ఏపీ ఉద్యోగులకు తలుపులు – తెలంగాణ యువతకు తాళం
  5. నామపురం మాజీ ఎంపీటీసీ ఉరిపక్క సరిత నగేష్

మర్రిగూడ,(విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఆంధ్రా కా  తెలంగాణకా అంటూ నామాపురం మాజీ ఎంపీటీసీ ఊరి పక్కసరిత నాగేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. అంతర్రాష్ట్ర బదిలీల పేరుతో 1943 మంది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను తెలంగాణకు బదిలీ చేయడానికి రేవంత్ సర్కార్ సుముఖత వ్యక్తం చేయడం తెలంగాణ నిరుద్యోగ యువత ఆశలకు గండిపడే చర్య అని అయన మండిపడ్డారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో

ఉద్యమ త్యాగాల పునాదుల మీద అయితే ఇప్పుడు అదే తెలంగాణలో ఇతర రాష్ట్రాల ఉద్యోగులకు తలుపులు తీయడం తెలంగాణ ఉద్యమ ఆత్మను అవమానించడమేనని ఆయన ఆరోపించారు. తెలంగాణలో త్వరత్వరగా ప్రమోషన్లు లభిస్తున్నాయన్న కారణంతో ఏపీ ఉద్యోగులు తెలంగాణకు రావడానికి ఉవ్విళ్లూరుతున్నారని దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అనుమతి ముద్ర వేయడం పరిపాలనా నిర్ణయం కాదు రాజకీయ ద్రోహమని ఆమె వ్యాఖ్యానించారు. అయితే మరోవైపు సొంత రాష్ట్రానికి వెళ్తామని వేడుకుంటున్న 1,369 మంది ఏపీ ఉద్యోగులను మాత్రం తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేయడం లేదు. ఇది స్పష్టమైన ద్వంద్వ విధానమా లేక దాగిన రాజకీయ ప్రయోజనాలా? అని ముఖ్యమంత్రిని నేరుగా ప్రశ్నించారు.