ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
20 మందికి గాయాలు, బల్వంతపూర్ వద్ద ఘటన
జగిత్యాల, ఆగస్టు17(విజయక్రాంతి): జగిత్యాల- కరీంనగర్ జాతీయ రహదారిపై బల్వంతపూర్ అడ్డరోడ్డు వద్ద సోమవారం రాత్రి ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. కరీంనగర్-1 డిపోకు చెందిన బస్సు సుమారు 60 మందికిపైగా ప్రయాణికులతో జగిత్యాల వైపునకు వెళ్తుండగా ప్రమాదం జరి గింది.
ఎదురుగా వచ్చిన లారీ ఒక్కసారిగా బస్సును ఢీకొనడంతో కుదుపునకు బస్సు కుదుపునకు గురైంది. పలువురు ప్రయాణికులు సీట్ల మధ్య చిక్కుకోకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.






