పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
బుద్ధ నగర్ లో కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక పర్యటన
మేడిపల్లి,(విజయక్రాంతి): పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో 10వ డివిజన్ పీర్జాదిగూడ, బుద్ధ నగర్ కాలనీలో కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ ఆకస్మిక పర్యటన చేశారు.
ఈ సందర్భంగా కాలనీలో జరుగుతున్న పారిశుధ్యం, మొక్కల పెంపకం, డ్రైనేజీ వ్యవస్థ, వీధిలైట్ల నిర్వహణ, తదితర అంశాలపై పర్యవేక్షించారు. సంబంధిత అధికారులు, ప్రజలతో పలు సమస్యలను తెలుసుకుని సూచనలు, సలహాలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని, పచ్చదనం పరిశుభ్రతపై , ప్రజల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.






